Jayalakshmi | కళాతపస్వి సతీమణి జయలక్ష్మి కన్నుమూత
Jayalakshmi | దివంగత లెజెండరీ దర్శకుడు, కళాతపస్వి కే విశ్వనాథ్ లేరన్న వార్తను తెలుగు ప్రేక్షకులు ఇంకా పూర్తిగా జీర్ణించుకోకముందే ఆయన ఇంట మరో విషాదం చోటుచేసుకుంది. విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి (86) కన్నుమూశారు.
Jayalakshmi | దివంగత లెజెండరీ దర్శకుడు, కళాతపస్వి కే విశ్వనాథ్ ఇటీవలే కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మృతితో యావత్ సినీ ప్రపంచం తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కే విశ్వనాథ్ లేరన్న వార్తను తెలుగు ప్రేక్షకులు ఇంకా పూర్తిగా జీర్ణించుకోకముందే ఆయన ఇంట మరో విషాదం చోటుచేసుకుంది.
విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి (86) కన్నుమూశారు. గుండెపోటు రావడంతో జయలక్ష్మి తుదిశ్వాస విడిచారు. కే విశ్వనాథ్ భౌతికంగా అందరినీ విడిచి నెల కూడా గడవక ముందే ఆయన సతీమణి కన్నుమూయడంతో సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. కే విశ్వనాథ్ 21వ ఏట జయలక్ష్మిని పెళ్లి చేసుకున్నారు. విశ్వనాథ్-జయలక్ష్మి దంపతులకు ముగ్గురు సంతానం. కాగా వీరిలో ఒకరు అమ్మాయి కాగా.. ఇద్దరు అబ్బాయిలు.
జయలక్ష్మి మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

