Bigg Boss Non Stop | బిగ్ బాస్ చరిత్రలోనే సరికొత్త అధ్యాయం ఈరోజు నుంచి ప్రారంభం అయింది. సాధారణంగా.. బిగ్ బాస్ అంటే రోజూ ఓ గంట మాత్రమే ఎపిసోడ్ చూపిస్తారు. కానీ.. ఈసారి మాత్రం అలా కాదు.. బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరుతో డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో 24 గంటలు లైవ్‌లో బిగ్ బాస్ హౌస్‌లో ఏం జరుగుతుందో వీక్షించవచ్చు. అందుకే.. దానికి బిగ్ బాస్ నాన్ స్టాప్ అని పేరు పెట్టారు.
బిగ్ బాస్ ఓటీటీ కాన్సెప్ట్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. 17 మంది కంటెస్టెంట్లను రెండు గ్రూపులగా విడదీశారు. అందులో కొందరు వారియర్స్.. మరికొందరు చాలెంజర్స్. వారియర్స్ అంటే ఇప్పటికే పూర్తి చేసుకున్న బిగ్ బాస్ 5 సీజన్లలో పార్టిసిపేట్ చేసిన వాళ్లలో కొందరిని బిగ్ బాస్ ఓటీటీ కోసం కూడా తీసుకున్నారు. చాలెంజర్స్ అంటే కొత్త కంటెస్టెంట్లు. వారియర్స్‌గా బరిలోకి దిగిన కంటెస్టెంట్లు 9 మంది. వాళ్లు అషు రెడ్డి, మహేశ్ విట్ట, ముమైత్ ఖాన్, అరియానా గ్లోరీ, నటరాజ్ మాస్టర్, తేజస్వియ మదివాడ, సరయు, హమిద, అఖిల్.
ఇక మిగిలిన 8 మంది చాలెంజర్స్ అజయ్ కథుర్వార్, స్రవంతి చొకారపు, ఆర్జే చైతూ, శ్రీరాపక, అనిల్ రాథోడ్, మిత్రా శర్మ, యాంకర్ శివ, బిందు మాధవి. ఈ 17 మంది కంటెస్టెంట్లులో రెండు గ్రూపులు. ఈ రెండు గ్రూపులలో ఏ గ్రూప్ విజయం సాధిస్తుంది. 84 రోజుల వరకు ఎంతమంది ఉంటారు. చివరికి కప్ ఎవరి చేతుల్లోకి వెళ్తుంది.. అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
ప్రతి శని, ఆదివారం మాత్రం హోస్ట్ నాగార్జున ఎపిసోడ్స్ ఉంటాయి. అప్పుడే ఎలిమినేషన్స్ కూడా ఉంటాయి. నామినేషన్స్, టాస్కులు.. ఇతర కంటెంట్ మొత్తం మామూలు బిగ్‌బాస్‌లో ఉన్నట్టే ఇందులోనూ ఉంటాయి. కాకపోతే.. రెండు గ్రూపుల మధ్య మాత్రం ఈసారి గట్టి పోటీ ఉండేలా బిగ్ బాస్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.