వినోద్, మధుప్రియ, కోటి కిరణ్, అవంతిక ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ల్యాంప్’. రాజశేఖర్ రాజ్ దర్శకుడు. ఈ నెల 14న విడుదలకానుంది. శుక్రవారం నిర్వహించిన ప్రీరిలీజ్ వేడుకకు సీనియర్ నటుడు మురళీమోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఓ కొత్త కాన్సెప్ట్‌తో ఈ సినిమా తీశామని, అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయని దర్శకుడు తెలిపారు.
కొత్త కంటెంట్‌ను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుందని నిర్మాత జీవీఎన్ శేఖర్ రెడ్డి తెలిపారు. ఈ కథలో ఇంట్రెస్టింగ్ పాయింట్‌ను చర్చించామని హీరో వినోద్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీవెంకట్, రచన-దర్శకత్వం: రాజశేఖర్ రాజ్.