Lal Singh Chaddha Ott Rights | బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్‌ఖాన్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా పలు విభాగాల్లో పనిచేస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. సందేశాత్మక సినిమాలను చేయడంలో ఈయన ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు. ప్రస్తుతం ఈయన నటించిన ‘లాల్ సింగ్ చడ్డా’ కూడా ఈ జానర్‌కు చెందిందే. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య కీలకపాత్రలో నటించాడు. ఇప్పటికే చిత్రం నుండి విడులైన ప్రచార చిత్రాలు, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. తెలుగులో ఈ చిత్రానికి చిరంజీవి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 11న పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుస అప్డేట్లను ఇస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
‘లాల్ సింగ్ చడ్డా’ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకుంది. అయితే బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ అన్ని భాషలకు కలుపుకుని దాదాపు 160కోట్లకు విక్రయించిందట. అంతేకాకుండా ఈ చిత్రం థియేటర్ రిలీజ్‌కు 6నెలల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కానుందట. ఇందులో నిజమెంతుందో తెలియదు గాని ఇంత మొత్తంలో నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఓటీటీ హక్కలను కొనుగోలు చేసిందంటే విశేషం అనే చెప్పాలి. ఈ లెక్కన చూసుకుంటే కేవలం ఓటీటీ రైట్స్‌తోనే ఈ సినిమా టోటల్ బడ్జెట్ రికవరీ అయినట్టే. ఇక ఈ చిత్రం హాలీవుడ్ ‘ఫారెస్ట్ గంప్’ సినిమాను బేస్ చేసుకుని తెరకెక్కించారు. అమీర్‌కు జోడీగా కరినా కపూర్ హీరోయిన్గా నటించింది. వయాకమ్18 స్టూడీయోస్‌తో కలిసి అమీర్‌ఖాన్ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. గతంలోనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పలు కారణాల వల్ల విడుదల తేదీ వాయిదా పడుతూ వచ్చింది. కాగా ఈ చిత్రం ఆగస్టు 11న హిందీతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదల కానుంది.