ఎర్రగుడి నేపథ్యంలో అమ్మవారి చుట్టూ అల్లుకున్న పీరియాడిక్ ప్రేమకథ ‘ఆదిపర్వం’. మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రంలో ఆదిత్య ఓం, ఎస్తేర్, శివ కంఠమనేని కీలక పాత్రధారులు. సంజీవ్ మేగోటి దర్శకుడు. ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘1974-90 మధ్య కాలంలో జరిగిన యదార్థ సంఘటనల సమాహారంగా ఈ సినిమాను రూపొందించాం. అమ్మోరు, అరుంధతి సినిమాల తరహాలో ఈ సినిమా ఉంటుంది. దుష్టశక్తికీ, దైవశక్తికీ మధ్య జరిగే పోరాటమే ఈ సినిమా. టెక్నికల్‌గా కొత్త అనుభూతిని కలిగించే సినిమా ఇది’ అని తెలిపారు. సుహాసిని, శ్రీజిత ఘోష్, సత్యప్రకాశ్, సమ్మెట గాంధీ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: ఎస్.ఎన్.హరీశ్, సహనిర్మాతలు: గోరెంట శ్రావణి, రవి మొదలవలస, ప్రదీప్ కాటకూటి, రవి దశిక, శ్రీరామ్ వేగరాజు, నిర్మాణం: అన్వికా ఆర్ట్స్, ఏఐ(అమెరికా ఇండియా)ఎంటైర్టెన్మెంట్స్.