మంచు మోహన్ బాబు నట వారసులిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మంచు లక్ష్మీ వినోద రంగంలో విశేషంగా రాణిస్తున్నారు. నటిగా, నిర్మాతగా, టెలివిజన్ హోస్ట్‌గా, యూట్యూబర్‌గా ఇలా ఎన్నో రకాలుగా తన టాలెంట్‌తో ప్రేక్షకులను ఆకర్షిస్తున్నారు. ఒకప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులని అలరించిన మంచు లక్ష్మీ ఈ మధ్య బుల్లితెరకే పరిచయం అయింది.
అమెరికాలో విద్యనభ్యసించి అక్కడ కొన్ని చిత్రాల్లో నటించిన లక్ష్మి.. తర్వాత ఇండియా వచ్చారు. తెలుగులో తొలి సినిమా ‘అనగనగ ఓ ధీరుడు’లో నటించారు. ఈ సినిమాలోనే నెగిటివ్ రోల్లో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించిన మంచు లక్ష్మీ మొదటి చిత్రంలోనే నంది అవార్డును సొంతం చేసుకున్నారు .
టెలివిజన్‌లో పలు రకాల షోలు, గేమ్ షోలు, రియాలిటీ షోలతో ఆకట్టుకొన్న టాలెంటెడ్ యాక్టర్ మంచు లక్ష్మీ రీసెంట్గా ఓటీటీలోకి అడుగుపెట్టింది.ఆహా యాప్‌లో వంటల కార్యక్రమాన్ని చేపట్టి మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ షోకి ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు హాజరు అవుతూ తెగ సందడి చేస్తున్నారు.
ఇక మంచు లక్ష్మీకి ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానెల్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో అప్పుడప్పుడు తన కూతురితో చేసే సందడికి సంబంధించిన వీడియోలు షేర్ చేస్తుంటుంది. తాజాగా ‘మై హోమ్ టూర్’ అంటూ ఇంటి అందాలను చూపించింది. ముఖ్యంగా తన మేకప్ గది, ఆఫీస్ రూమ్, మినీ సినిమా థియేటర్ ఆకట్టుకుంటున్నాయి. ఇక లక్ష్మి తన హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్‌ను చూపిస్తూ.. ‘అమ్మాయిలు ఇది చూసి మీరు కుళ్లుకుంటారు లేదా సంతోషిస్తారు’ అని చెప్పుకొచ్చారు.