నూతన నిర్మాణ సంస్థ 20th సెంచరీ రూపొందిస్తున్న తొలి చిత్రం ‘లగ్గం టైమ్’. రాజేష్ మేరు, నవ్య చిత్యాల జంటగా నటిస్తున్నారు. ప్రజోత్ కె వెన్నం దర్శకుడు. కె.హిమబిందు నిర్మాత. ఇటీవల ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను యువ దర్శకుడు సాగర్ కె చంద్ర ఆవిష్కరించారు. ‘పెళ్లి నేపథ్యంలో సాగే కథాంశమిది.
చక్కటి హాస్యంతో పాటు హృదయాన్ని కదిలించే సెంటిమెంట్‌తో ఆకట్టుకుంటుంది. కుటుంబం అంతా కలిసి హాయిగా ఆస్వాదించేలా ఉంటుంది. ఫీల్‌గుడ్ ఎంటర్టైనర్గా అన్ని వర్గాలను మెప్పిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తాం’ అని చిత్ర బృందం పేర్కొంది. నెల్లూరు సుదర్శన్, ప్రీతిసుందర్, ప్రణీత్ రెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ, సంగీతం: పవన్ గుంటుకు, రచన-దర్శకత్వం: ప్రజోత్ కె వెన్నం.