Laggam | సాయిరోనక్, ప్రజ్ఞ నగ్ర జంటగా నటిస్తున్న చిత్రం ‘లగ్గం’. రమేష్ చెప్పాల దర్శకత్వం వహిస్తున్నారు. వేణుగోపాల్ రెడ్డి నిర్మాత. త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా ట్రైలర్ను వినూత్నరీతిలో ఆవిష్కరించారు. ఇంజాపూర్లోని శ్రీరస్తు కల్యాణ మండపంలో జరిగిన ఓ వివాహ వేడుకలో వధూవరుల చేత ట్రైలర్ను లాంచ్ చేయించారు.
ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు. తెలంగాణ పెళ్లి వేడుక నేపథ్యంలో ఆద్యంతం హాస్య ప్రధానంగా, చక్కటి భావోద్వేగాలతో సాగే చిత్రమిదని, తెలంగాణ లగ్గం తాలూకు వైభవాన్ని కళ్లకుకడుతుందని మేకర్స్ తెలిపారు. రాజేంద్రప్రసాద్, రోహిణి, సప్తగిరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నేపథ్య సంగీతం: మణిశర్మ, సంగీతం: చరణ్ అర్జున్, కథ, మాటలు, స్క్రీన్ప్లే, దర్శకత్వం: రమేష్ చెప్పాల.