Robinhood | టాలీవుడ్ నితిన్ (Nithiin) నటిస్తోన్న తాజా చిత్రం రాబిన్‌హుడ్ (Robinhood). వెంకీ కుడుముల (Venky Kudumula) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే టైటిల్‌ను ప్రకటిస్తూ షేర్ చేసిన గ్లింప్స్ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. డబ్బు చాలా చెడ్డది.. రూపాయి రూపాయి నువ్వేం చేస్తావే అంటే అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల మధ్య చిచ్చు పెడతానంటది. అన్నట్టే చేసింది.. దేశమంత కుటుంబం నాది. ఆస్తులున్నోళ్లంతా నా అన్నదమ్ముళ్లు.
ఆభరణాలు వేసుకున్నోళ్లంతా నా అక్కాచెల్లెళ్లు. అవసరం కొద్దీ వాళ్ల జేబుల్లో చేతులు పెడితే ఫ్యామిలీ మెంబర్ అని కూడా చూడకుండా నా మీద కేసులు పెడుతున్నారు… అంటూ సాగుతున్న డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. లేడీ బాస్ రేపు ఉదయం 11:07 గంటలకు ల్యాండింగ్ అవుతున్నట్టు విమానం లుక్ ఒకటి షేర్ చేశారు మేకర్స్. ఇంతకీ ఆ లేడీ బాస్ ఎవరనేది మాత్రం సస్పెన్స్‌లో పెట్టారు మేకర్స్.
నితిన్ ఈ సారి దొంగగా సరికొత్త అవతారంలో కనిపించబోతున్నట్టు గ్లింప్స్ తో క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్. ఈ చిత్రంలో నటకిరిటీ రాజేంద్రప్రసాద్, వెన్నెల కిశోర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, రవి శంకర్ నిర్మి్స్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. సాంటాక్లాజ్ గెటప్‌లో కనిపిస్తూ తనదైన డైలాగ్ డెలివరీతో ఎంటర్టైన్ చేస్తున్నాడు.
The BOSS LADY is landing with all style and swag 😎
Welcome her tomorrow at 11:07 AM ❤️🔥#Robinhood in cinemas from December 20th, 2024 💥💥@actor_nithiin @VenkyKudumula @gvprakash pic.twitter.com/s7NpU7sai4— Mythri Movie Makers (@MythriOfficial) June 13, 2024
రాబిన్‌హుడ్ టైటిల్ గ్లింప్స్..