Nayanthara | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటీమణుల్లో టాప్ ప్లేస్‌లో ఉంటుంది నయనతార (Nayanthara). గ్లామరస్ పాత్రలు చేస్తూ.. మరోవైపు పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్‌లో నటిస్తూ లేడీ సూపర్ స్టార్‌గా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం షారుఖ్‌ఖాన్-అట్లీ కాంబోలో వస్తున్న జవాన్ (Jawan)తో బిజీగా ఉంది. నయనతార ఇన్స్టాగ్రామ్(Instagram)లోకి ఎంట్రీ ఇచ్చిందని తెలిసిందే. తన పిల్లలతో హ్యాపీ మూడ్‌లో ఉన్న స్టిల్‌ను తొలి పోస్ట్‌గా షేర్ చేసింది.
ఇలా పోస్ట్ పెట్టిందో..లేదో నెటిజన్లు, ఫాలోవర్లు, అభిమానులు ఒక్కసారిగా నయనతార ఖాతాపై అటాక్ చేశారు. నయన్కున్న క్రేజ్ కొన్ని గంటల్లోనే ఆమెకు మిలియన్ ఫాలోవర్లను తెచ్చి పెట్టింది. తక్కువ సమయంలో (24 గంటల్లోపే) మిలియన్ ఫాలోవర్లను సంపాదించిన హీరోయిన్గా రికార్డు క్రియేట్ చేసింది నయనతార. గతంలో బాలీవుడ్ భామ కత్రినాకైఫ్ మిలియన్ ఫాలోవర్ల మార్క్‌ను చేరుకునేందుకు 24 గంటలు దాటింది. దీంతో అరుదైన రికార్డు నమోదు చేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది నయనతార.
గంటల్లోనే మిలియన్ ఫాలోవర్లను దాటేసిన నయన్ మరికొన్ని రోజుల్లోనే 10 మిలియన్ల ఫాలోవర్లు సంపాదించుకోవడం పక్కా అని అంటున్నారు మూవీ లవర్స్. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వస్తోన్న జవాన్ చిత్రంలో నయనతార ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా మెరువబోతుంది. నయన్ యాక్షన్ అవతార్‌లో మెస్మరైజ్ చేయబోతున్నట్టు జవాన్ రషెస్ చెబుతున్నాయి. నయనతార మరోవైపు Iraivan, Ladysuperstar75, Test చిత్రాల్లో నటిస్తోంది.
జవాన్ సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జవాన్‌లో షారుఖ్ ఖాన్ తండ్రి, కొడుకులుగా డ్యుయల్ రోల్లో కనిపించబోతున్నట్టు ఇన్సైడ్ టాక్. ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తుండగా.. ఇప్పటికే విజయ్ సేతుపతి క్యారెక్టర్‌ను పరిచయం చేస్తూ.. DEALER OF DEATH క్యాప్షన్‌తో షేర్ చేసిన లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. జవాన్ టైటిల్ అనౌన్స్మెంట్ టీజర్‌తోపాటు Jawan Prevue సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.
జవాన్‌లో ప్రియమణి, సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ భామ దీపికా పదుకొనే అతిథి పాత్రలో మెరవనుంది. ఈ మూవీని షారుఖ్ ఖాన్ హోంబ్యానర్ రెడీ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై గౌరీఖాన్ తెరకెక్కిస్తోంది.
ఇన్‌స్టా ఎంట్రీతోనే రికార్డు..
జవాన్ టైటిల్ అనౌన్స్ మెంట్ టీజర్ ..
Jawan Prevue..