గత ఏడాది ‘మ్యాడ్’ చేసిన అల్లరి అంతాఇంతాకాదు. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసిందీ సినిమా. ఇప్పుడు ఆ అల్లరిని డబుల్ చేస్తూ మ్యాడ్ మ్యాక్స్ ఎంటర్టైనర్గా ‘మ్యాడ్ స్కేర్’ను తీసుకొస్తున్నది ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటైర్టెన్మెంట్స్. కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో వహిస్తున్న ఈ సీక్వెల్‌పై ప్రకటనతోనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. శుక్రవారం ‘లడ్డు గాని పెళ్లి’ పాటతో మేకర్స్ ప్రచారాన్ని షురూ చేశారు. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను భీమ్స్ సిసిరోలియో స్వరపరిచి, మంగ్లీతో కలిసి ఆలపించారు. ఈ పాట ప్రస్తుతం విశేషంగా ఆదరణ పొందుతున్నదని, ‘మ్యాడ్’ పాటల్ని మించే స్థాయిలో ‘మ్యాడ్ స్కేర్’ పాటలు ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ ఈ పాటలో ఎంత జోష్‌గా కనిపించారో.. అంతకు రెట్టింపు జోష్‌తో సినిమాలో ఉంటారని, ‘మ్యాడ్ స్కేర్’ పేరుకు తగ్గట్టే డబుల్ వినోదాన్ని ఇవ్వడం ఖాయమని మేకర్స్ చెబుతున్నారు. త్వరలో విడుదల కానున్న ఈ సినిమాకు కెమెరా: షామ్‌దత్, నిర్మాతలు: హారిక సూర్యదేవర, సాయిసౌజన్య, సమర్పణ: సూర్యదేవర నాగవంశీ.