Laapataa Ladies | పెళ్లికూతురు మిస్సింగ్.. ఆకట్టుకుంటున్న ‘లాపటా లేడీస్’ టీజర్
Laapataa Ladies | బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావ్ (Kiran Rao) 'లాపటా లేడీస్' (Laapataa Ladies) అనే మూవీకి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా.. ఈ మూవీకి అమీర్ ఖాన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తోన్నాడు. ఇక మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇటివలే విడుదల చేయగా.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ టీజర్ (Laapataa Ladies Teaser) విడుదల చేశారు.
Laapataa Ladies | బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ (Aamir Khan) ప్రోడక్షన్ నుంచి సినిమా వస్తుందంటే క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికే ఆయన ప్రొడక్షన్లో వచ్చిన, దోబీ ఘాట్ (Dhobi ghat), తారే జమీన్ పర్ (Taare Jamin Par), సీక్రెట్ సూపర్ స్టార్ (Secret Super Star), దంగల్ (Dangal) చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ సాధించాయి. ఇదిలా ఉండగా.. తన మాజీ భార్య కిరణ్ రావ్ (Kiran Rao) ‘లాపటా లేడీస్’ (Laapataa Ladies) అనే మూవీకి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా.. ఈ మూవీకి అమీర్ ఖాన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తోన్నాడు. ఇక మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇటివలే విడుదల చేయగా.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ టీజర్ (Laapataa Ladies Teaser) విడుదల చేశారు.
టీజర్ గమనిస్తే.. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ ఉండనున్నట్లు తెలుస్తుంది. కొత్తగా పెళ్లి అయిన ఓ జంట ట్రైన్లో వెళుతుండగా.. తన భార్య మిస్ అవుతుంది. ఇక ట్రైన్లో కొత్త పెళ్లికూతురు ఎలా మిస్సయింది? ఆ తర్వాత ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా రానుంది. ఇక జమ్తారా వెబ్‌సిరీస్ ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ్ (Sparsh Shrivastav) ఈ మూవీలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ 2024 జనవరి 5న థియేటర్లలో రిలీజ్ కానుంది.
దాదాపు పన్నెండేళ్ల విరామం తర్వాత కిరణ్ రావ్ మెగాఫోన్ పట్టింది. ఆమె చివరగా 2010లో దోబీ ఘాట్ అనే చిత్రానికి దర్శకత్వం వహించింది. ఈ చిత్రం అప్పట్లో ఇంటర్వెల్ లేకుండా తీసిన మూవీగా రికార్డు సాధించింది.
Tarikh pata chali hai,
Unka pata bhi jald hi lag jayega !#LaapataaLadies 5 January 2024 se aapke nazdiki cinema gharon mein !
Directed by #KiranRao
Original Story by #BiplabGoswami
Screenplay & Dialogues by #SnehaDesai
Additional Dialogues by #DivyanidhiSharma pic.twitter.com/93E1iBiwxt— Aamir Khan Productions (@AKPPL_Official) September 8, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
NXTinAI | వెండితెరపై కృత్రిమ మేధ హవా.. గ్యాలరీ5 ‘నెక్ట్స్ఇన్ఏఐ’ సదస్సు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

