Janhvi Kapoor | తెలుగు, తమిళం, హిందీతోపాటు ఇండియావైడ్‌గా సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న భామల్లో టాప్‌లో ఉంటుంది జాన్వీకపూర్ (Janhvi Kapoor). సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఈ భామ తన అప్‌కమింగ్ సినిమా మిస్టర్ అండ్ మిసెస్ మహి విడుదల కోసం ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తోంది. ఈ చిత్రం మే 31న విడుదల కానుంది. కిరణ్‌రావు డైరెక్ట్ చేసిన Laapataa Ladies చిత్రాన్ని వీక్షించింది జాన్వీకపూర్.
ఈ సినిమా గురించి స్పందిస్తూ.. సినిమాలో లీడ్ రోల్స్ పోషించిన యాక్టర్ల అసాధారణమైన నటనపై ప్రశంసలు కురిపించింది. ఇంత అందమైన కళాఖండాన్ని రూపొందించినందుకు హ్యాట్సాఫ్.. అంటూ డైరెక్టర్ కిరణ్ రావుకు అభినందనలు. ప్రత్యేక పర్ఫార్మెన్స్తో చాలా ప్రత్యేకమైన చిత్రం. గుండెలకు హత్తుకునేలా ఉంది.. అని తెలియజేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో సందేశాన్ని పోస్ట్ చేసింది.
ఈ చిత్రం సెప్టెంబర్ 8న 48వ టొరంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో స్క్రీనింగ్ అయింది. 2024 మార్చి 1న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన తర్వాత ప్రేక్షకులను అటెన్షన్‌ను తనవైపునకు తిప్పుకోవడంలో విజయవంతమైంది. చాలా మంది తెలుగు ప్రేక్షకులు ఈ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ పెట్టాలని కోరుతుండటం విశేషం.
ఈ మూవీని అమీర్‌ఖాన్ ప్రొడక్షన్స్, Kindling Pictures బ్యానర్లపై కిరణ్‌రావ్, జ్యోతిదేవ్ పాండే, అమీర్ ఖాన్ సంయుక్తంగా నిర్మించారు. నిటాన్షి గోయెల్, స్పర్ష్ శ్రీవాత్సవ్, ప్రతిభ రత్న, అభయ్ దూబే, ఛాయ కదం, రవికిషన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.
Jhanvikapoor