‘లాపతా లేడీస్’ నటుడు సతేంద్ర సోని ప్రముఖ సినీ నిర్మాత పుష్యేంద్ర సింగ్, ఆయన భార్య ప్రగతి చౌహాన్లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘పెయిడ్ పాల్కీ’ సినిమా షూటింగ్ సమయంలో పారితోషికం ఇవ్వకుండా మోసం చేయడంతో పాటు, తన ఎత్తును() చూసి వేధించి, భౌతిక దాడికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.
మధ్యప్రదేశ్లోని షూటింగ్ లొకేషన్లో తనకు సరైన వసతులు కల్పించలేదని, వ్యానిటీ వ్యాన్ లేకపోగా, పాచిపోయిన ఆహారం పెట్టారని సోని తెలిపారు. బకాయిల కోసం నిలదీస్తే నిర్మాత భార్య ప్రగతి చౌహాన్ తనను దూషించి, మిగతా డబ్బులు ఇవ్వనని బెదిరించారని వాపోయారు. ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటామన్న తమపై దాడి చేశారని, ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారని ఆరోపించారు. కాగా.. ఈ ఘటనపై ముంబైలో జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. మరోవైపు సతేంద్ర సోనితో పాటు బాధిత నటులకు ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ (AICWA) మద్దతు ప్రకటించింది.