Vijay Deverakonda | టాలీవుడ్లో ‘లాలో’ రీమేక్.. శ్రీకృష్ణుడిగా విజయ్ దేవరకొండ?
Laalo – Krishna Sada Sahaayate | గుజరాతీలో సంచలన విజయం సాధించి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన ‘లాలో – కృష్ణ సదా సహాయతే’ సినిమా తెలుగు రీమేక్‌కు సంబంధించిన వార్తలు టాలీవుడ్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.
Laalo – Krishna Sada Sahaayate | గుజరాతీలో సంచలన విజయం సాధించి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన ‘లాలో – కృష్ణ సదా సహాయతే’ సినిమా తెలుగు రీమేక్‌కు సంబంధించిన వార్తలు టాలీవుడ్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి రోజుకో కొత్త పేరు తెరపైకి వస్తుండటంతో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. అంకిత్ సకియా దర్శకత్వంలో రూపొందిన ఈ డివోషనల్-డ్రామా చిత్రం గుజరాతీలో రూ. 100 కోట్లకు పైగా వసూలు చేయగా, ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
మొదట ఈ చిత్రంలో కీలకమైన శ్రీకృష్ణుడి పాత్రలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తారంటూ జోరుగా ప్రచారం జరగగా, తాజా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఆ స్థానంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ కనిపించనున్నాడని ప్రచారం ఊపందుకుంది. ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో ఇప్పటికే అలరించిన విజయ్ దేవరకొండ, ఇప్పుడు శ్రీకృష్ణుడి పాత్రలో నటించనున్నాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. సాధారణ ఆటో డ్రైవర్ జీవితంలో జరిగే ఊహించని పరిణామాలు, ఆధ్యాత్మిక అనుభవాలు, శ్రీకృష్ణుడి నేతృత్వంలో సాగే ఆత్మశోధన ఈ చిత్ర ప్రధానాంశం కావడంతో తెలుగు ప్రేక్షకుల భావోద్వేగాలను హత్తుకోవడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. దిల్ రాజు నిర్మాణంలో, విజయ్ దేవరకొండ లాంటి యూత్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఈ శక్తివంతమైన పాత్రలో కనిపించబోతున్నారనే ప్రచారంపై మేకర్స్ నుండి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

