మలయాళ అగ్ర కథానాయకుడు మోహన్‌లాల్ నటిస్తున్న తాజా చిత్రం ‘లూసిఫర్-2: ఎంపురాన్’. 2019లో వచ్చిన ‘లూసిఫర్’ చిత్రానికి సీక్వెల్ ఇది. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్నది. మార్చి 27న పాన్ ఇండియా స్థాయిలో విడుదలకానుంది. సోమవారం టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో డాన్ ఖురేషి అబ్రామ్గా మోహన్‌లాల్‌ను పవర్‌ఫుల్‌గా ప్రజెంట్ చేశారు. ‘ఈ యుద్ధం మంచికి చెడుకి కాదు ..చెడుకి చెడుకీ మధ్య..’ వంటి డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉన్నాయి. ‘లూసిఫర్’ సినిమా కంటే గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే, రోమాంచితమైన యాక్షన్ ఘట్టాలతో ఈ సినిమాను తెరకెక్కించామని, మోహన్‌లాల్ పాత్ర అత్యంత శక్తివంతంగా సాగుతుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రంలో టోవినో థామస్, మంజు వారియర్, నందు, సానియా అయ్యప్పన్ తదితరులు నటించారు.