L2 Empuraan | ఒకవైపు వివాదాలను ఎదుర్కోంటునే మరోవైపు బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతుంది మలయాళ చిత్రం ఎల్ 2 ఎంపురాన్(L2: Empuraan). మలయాళీ సూపర్ స్టార్, నటుడు మోహన్‌లాల్ (Mohanlal) ప్రధాన పాత్రలో నటించగా.. మలయాళ నటుడు, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మంజు వారియర్ (Manju Warrier), టోవినో థామస్(Tovino Thomas) కీలక పాత్రల్లో నటించారు. మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఒకవైపు పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతునే మరోవైపు వివాదాల్లో చిక్కుకుంది. గుజరాత్ గోద్రా అల్లర్లకు సంబంధించి ఒక వర్గాన్ని అవమానకరంగా చిత్రీకరించే విధంగా ఈ చిత్రంలో సన్నివేశాలు ఉన్నాయని విమర్శలు వచ్చాయి. దీంతో ఈ వివాదంపై సెన్సార్ బోర్డ్ 17 కట్స్ చెప్పడంతో పాటు మోహన్‌లాల్ కూడా క్షమాపణలు తెలిపాడు. అయితే ఎన్ని వివాదాలు వచ్చిన కలెక్షన్స్‌లో మాత్రం తగ్గట్లేదు ఈ చిత్రం.
విడుదలైన కేవలం నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్లకు పైగా వసుళ్లను రాబట్టింది. దీంతో నాలుగు రోజుల్లోనే రూ.200 కోట్ల రాబట్టిన తొలి మలయాళ చిత్రంగా ఎంపురాన్ రికార్డు నమోదు చేసింది. ఇప్పటివరకు ఈ రికార్డు ‘మంజుమ్మల్ బాయ్స్’ సినిమా పేరిట ఉండగా.. తాజాగా ఈ రికార్డును అధిగమించింది.
The OVERLORD shatters the 200 crore barrier in style! EMPURAAN makes history!#L2E #Empuraan pic.twitter.com/9xQb2CWiV5
— Mohanlal (@Mohanlal) March 31, 2025