Shiva Nirvana Interview | టాలీవుడ్ సినీ జనాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో ఒకటి ఖుషి (Kushi). రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ (Vijay deverakonda), సమంత (Samantha) హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. శివనిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వంలో తెరకెక్కిన ఖుషి సెప్టెంబర్ 1న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది ఖుషి టీం. ప్రమోషన్స్‌లో భాగంగా డైరెక్టర్ శివనిర్వాణ మీడియాతో చిట్ చాట్ చేశాడు. ఖుషి విశేషాలు ఆయన మాటల్లోనే..
మీరు నర్వస్‌గా ఫీలవుతున్నారా..?
ఖుషి తొలి కాపీ నిన్న చూశా. సినిమా అవుట్‌పుట్ చూసి టీం మెంబర్స్ అంతా సంతోషంగా ఉన్నారు. ప్రస్తుతం నేను రిలాక్సింగ్ పొజిషన్లో ఉన్నా. తొలి కాపీ చూసిన విజయ్ సినిమా పట్ల చాలా సంతృప్తి వ్యక్తం చేశాడు.
ఈ సినిమా సఖి షేడ్స్‌లో ఉంటుందని జనాలంటున్నారు.. దీనిపై మీ రియాక్షన్ ఏంటి..?
అవును..వాటి గురించి విన్నా. డియర్ కామ్రేడ్ టైంలో విజయ్‌కు కథ చెప్పా. విజయ్ దేవరకొండ అప్పుడు లైగర్‌తో బిజీగా ఉన్నాడు. ఔట్ ఆఫ్ బాక్స్‌లో ఉండేలా ప్లాన్ చేసుకున్నా. కానీ ఈ కథ విజయ్‌కు నచ్చింది. లవ్ కాన్సెప్ట్‌తో చాలా సినిమాలు వచ్చాయి. ఖుషి చాలా సున్నితమైన అంశం చుట్టూ తిరుగుతుంది. ఈ విషయాన్ని ట్రైలర్లో చూపించలేదు.
ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బదులు మ్యూజికల్ కాన్సర్ట్ చేయడానికి కారణం..?
విజయ్-నేను ఈ విషయం గురించి మాట్లాడుకున్నాం. ఏదైనా కొత్తగా చేయాలని అనుకున్నాం. పాటలు చార్ట్‌బస్టర్స్ అవడంతో మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహించాలని.. పలు ఇండస్ట్రీల నుంచి మీడియాలకు ఆహ్వానం పంపాం. మ్యూజికల్ కాన్సర్ట్ సలహా ఇచ్చింది విజయ్ దేవరకొండ.
ఖుషిలో పాటలు రాశారు కదా.. దీని గురించి..?
నేను పాటలు రాయడం మొదటిసారేం కాదు. నిన్ను కోరి, మజిలీ, టక్ జగదీష్ సినిమాలకు కూడా పాటలు రాశా. హేశమ్ అబ్ధుల్ వహబ్ తెలుగు సినిమాకు కొత్త. ఆయనను గైడ్ చేశా. అలా నా రోజా నువ్వే సాంగ్‌తోపాటు మిగిలిన పాటలు వచ్చాయి.
సమంత పాత్ర ఎలా ఉండబోతుంది..?
సమంత లవ్‌స్టోరీలో నటించి చాలా కాలం అయింది. ఆ తర్వాత ది ఫ్యామిలీ మ్యాన్ లాంటి యాక్షన్ ఓరియెంటెడ్ సబ్జెక్టుల్లో నటించింది. ఖుషిలో వింటేజ్ సమంతను చూస్తారు.
విజయ్ పాత్ర గురించి ఏమైనా చెప్తరా..?
ఖుషి ద్వారా విజయ్‌లోని స్టైలిష్ కామెడీ టైమింగ్‌ను చూస్తారు. ఫ్యామిలీ ఆడియెన్స్, అమ్మాయిలు విజయ్‌తో ప్రేమలో పడతారు. సినిమాలో ఎలాంటి వల్గారిటీ ఉండదు. విజయ్‌కు గీతగోవిందం లాంటి మెమొరబుల్ సినిమా అవుతుంది.
మీ కొత్త సినిమాల మాటేంటి..?
ప్రస్తుతానికి నా ఫోకస్ అంతా ఖుషి మీదే ఉంది. సరైన సమయంలో నా కొత్త ప్రాజెక్టుల గురించి మాట్లాడుతా.
ఖుషి టైటిల్ సాంగ్..
నా రోజా నువ్వే..
ఆరాధ్య సాంగ్..