Kushboo | అలనాటి అందాల నటి ఖుష్బూ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. 90లలో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగిన ఖుష్బూ.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో అనేక సినిమాలు చేసి అలరించింది. తెలుగులో కూడా ఆమెకి ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తమిళ నాట ఆమె కోసం ఏకంగా ఓ గుడి కూడా కట్టారు. అయితే ప్రస్తుతం ఖుష్బూ సినిమాలతో పాటు రాజకీయాలు కూడా చేస్తుంది. అయితే ఖుష్బూ వ్యక్తిగత జీవితం, కుటుంబం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఆమె ప్రముఖ తమిళ దర్శకుడు సుందర్.సి ని వివాహం చేసుకోగా, వారిద్దరు ఎంతో అన్యోనంగా ఉంటారు.
ఇక ఈ దంపతులకి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిలో పెద్దమ్మాయి పేరు అవంతిక కాగా ఇప్పుడు ఆమె విదేశాల్లో చదువుకుంటోంది. ఖుష్బూ పిల్లలు ఎలా ఉన్నారు అని తెలుసుకోవాలనే ఆసక్తి చాలా మందిలో ఉంటుంది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అవంతిక పోస్ట్ చేసిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. మోడ్రన్ డ్రెస్సుల్లో గ్లామర్‌గా కనిపిస్తున్న అవంతికను చూసి నెటిజన్లు షాకవుతున్నారు. ఎంత అందంగా ఉంది.. తల్లి ఖుష్బూకు ఏమాత్రం తీసిపోదని కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా ఖుష్బూ కూతురు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
ఇక ఖుష్బూ ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్ లో కనిపిస్తూ సందడి చేస్తుంది. తల్లిగా, అత్తగా, అక్కగా, అమ్మగా ఇలా పలు కీలక పాత్రలలో కనిపించి మెప్పిస్తుంది. ఖుష్బూ ఇప్పటికీ అదే అందం మెయింటైన్ చేస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఖుష్బూ అప్పుడప్పుడు ఫొటో షూట్స్ చేసి వాటికి సంబంధించిన పిక్స్ నెట్టింట షేర్ చేస్తే అవి క్షణాలలో వైరల్ అవుతుంటాయి.