ఎంఎస్ఆర్ సంస్థ నిర్మిస్తున్న తొలి చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. కుశాల్ రాజు హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి మల్లిడి కృష్ణ దర్శకుడు. డా॥ లతా రాజు నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్‌నిచ్చారు. కామెడీ, లవ్ ఎలిమెంట్స్ సమపాళ్లలో మేళవించిన కథాంశమిదని, పృథ్వీరాజ్ పాత్ర కీలకంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. మంచి కథ ద్వారా హీరోగా పరిచయం కావడం ఆనందంగా ఉందని కుశాల్ రాజు తెలిపారు. ప్రస్తుతం తాను చేస్తున్న సినిమాల్లో ఇది బెస్ట్ అనుకోవచ్చని నటుడు పృథ్వీరాజ్ అన్నారు. జగపతిబాబు, పృథ్వీరాజ్, వైవా హర్ష, బబ్లూ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: అమర్నాథ్ బొమ్మిరెడ్డి, సంగీతం: శ్రీచరణ్ పాకాల, దర్శకత్వం: మల్లిడి కృష్ణ.