Cinema News | చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ధూం ధాం’. సాయికిశోర్ మచ్చా దర్శకుడు. ఎం.ఎస్.రామ్‌కుమార్ నిర్మాత. గోపీమోహన్ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్న ఈ చిత్రం వచ్చేనెలలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఇప్పటికే విడుదలైన మూడు పాటలు శ్రోతల్ని అలరిస్తున్నాయని మేకర్స్ ఆనందం వెలిబుచ్చారు. బుధవారం ఇందులోని నాలుగో పాటను దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు చేతుల మీదుగా విడుదల చేశారు.
‘అందమైన కుందనాల బొమ్మారా.. అన్నమయ్య కీర్తనల్లే ఉందిరా.. పద్ధతైన పారిజాత పువ్వురా.. నేనంటే ఇష్టమంటోందిరా..’ అంటూ సాగే ఈ పాటను రామజోగయ్యశాస్త్రి రాయగా, గోపీసుందర్ స్వరపరిచారు. శ్రీకృష్ణ ఆలపించారు. రామజోగయ్యశాస్త్రి సాహిత్యం ఈ పాటకు హైలైట్‌గా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. సాయికుమార్, వెన్నెలకిశోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సిద్ధార్థ్ రామస్వామి.