Nandamuri Kalyan Ram – Kumari 21F Director | టాలీవుడ్ కథానాయకుడు నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తన కెరీర్లోని 21వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న కళ్యాణ్ రామ్ మరోవైపు బ్లాక్ బస్టర్ మూవీ బింబిసార సినిమాకు ప్రీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు. ఇదిలావుంటే ఇవి రెండు కాకుండా కళ్యాణ్ రామ్ మరో స్టార్ దర్శకుడితో చేతులు కలపబోతున్నట్లు తెలుస్తుంది.
టాలీవుడ్లో కుమారి 21F, 18 పేజీస్ వంటి చిత్రాలతో హిట్ డైరెక్టర్గా మంచి పేరు తెచ్చుకున్నాడు దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్. ఆయన ప్రస్తుతం కళ్యాణ్ రామ్ కోసం ఒక కథను రెడీ చేశాడని.. ఆ కథను ఎన్కేఆర్కు వినిపించగా.. నందమూరి కళ్యాణ్ రామ్ కూడా ఓకే చెప్పినట్లు ఫిలిం నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ను త్వరలోనే పట్టాలకెక్కించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తుందని సమాచారం.
Also Read..