Kubrra Sait | నెట్‌ఫ్లిక్స్ నుంచి వచ్చిన సాక్రేడ్ గేమ్స్(Netflix’s Sacred Games) వెబ్ సిరీస్‌తో గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటి కుబ్రా సైత్(Kubrra Sait) తన వ్యక్తిగత జీవితంలో జరిగిన సంచలన విషయం గురించి మీడియాతో తాజాగా పంచుకుంది. తాను అండమాన్ ట్రిప్‌లో ఉన్నప్పుడు ఒక స్నేహితుడితో కలవడం వలన గర్భం దాల్చానని.. దీంతో ఒక్కసారిగా ఏం చేయాలో తోచలేదని అందుకే వెంటనే ఎవరికీ చెప్పకుండా.. ఒంటరిగా వెళ్లి అబార్షన్ చేయించుకున్నాను అంటూ నటి చెప్పుకోచ్చింది.
అబార్షన్ చేయించుకోవడానికి వెళ్లినప్పుడు నేను చాలా బలహీనంగా ఉన్నాను. అప్పుడే అర్థం అయ్యింది. దీనిని నేను మోయలేను అని.. ఒకవేళ నేను అబార్షన్ చేయంచుకోపోతే బిడ్డతో జీవిస్తానని చెప్పే ధైర్యం కూడా నాకు లేదనిపించింది. అందుకే ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా వెళ్లి అబార్షన్ చేయించుకున్నా. అబార్షన్ అనంతరం నేను చాలా రీలిఫ్ అయ్యాను. ఎదో బరువు దిగినట్లు అనిపించింది. అయితే అబార్షన్ తర్వాత ఈ విషయాన్ని చాలా ఏండ్ల వరకు ఎవరితో పంచుకోలేదని తెలిపింది. ఇక ఈ విషయాలన్నింటిన తన బయోగ్రఫీ అయిన ఓపెన్ బుక్: నాట్ క్వైట్ ఎ మెమోయిర్” (2022) అనే పుస్తకంలో ప్రస్తవించింది కుబ్రా సైత్
సినిమా విషయాలకు వస్తే.. సాక్రేడ్ గేమ్స్ తర్వాత మళ్లీ కనిపించలేదు ఈ నటి. అయితే తాజాగా బాలీవుడ్ నుంచి వస్తున్న రామాయణ్‌లో ఈ భామ రావణుడి చెల్లి శూర్పణఖ పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా దీనిపై చిత్రబృందం ప్రకటించాల్సి ఉంది.