Kuberaa | శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తమిళ నటుడు ధనుష్, టాలీవుడ్ నటుడు నాగార్జున, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కుబేర’ (Kuberaa).
పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 20, 2025న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను వాయిదా వేసిన విషయం తెలిసిందే. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం జరగడంతో ఈ వేడుకను వాయిదా వేసుకున్నారు మేకర్స్. తాజాగా ఈ వేడుకకి సంబంధించి కొత్త డేట్‌ని ప్రకటించారు. కుబేరా ప్రీ రిలీజ్ వేడుకను జూన్ 15న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించబోతున్నట్లు తెలిపారు. అలాగే ఈ మూవీ నుంచి రేపు ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది.
As a mark of respect for the tragic plane crash in Ahmedabad, the pre-release event of #Kuberaa has been rescheduled to June 15th (Sunday) at the same venue and time.
🎟️ All existing passes remain valid.
Thank you for your understanding and continued support.
-Team… pic.twitter.com/I7xssjE4Jb
— Shreyas Media (@shreyasgroup) June 13, 2025
Read More