Kubera Movie | తమిళ నటుడు ధనుష్ కథానాయకుడిగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘కుబేర’. ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్, ఫిదా, వంటి క్లాసిక్ సినిమాలు తీసిన శేఖర్ కమ్ముల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుండగా.. టాలీవుడ్ అగ్ర నటుడు అక్కినేని నాగార్జున కీలక పాత్రలో ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే మూవీ నుంచి వరుస అప్డేట్లను పంచుకున్న చిత్రబృందం తాజాగా విడుదల తేదీని ప్రకటించింది.
ఈ సినిమాను జూన్ 20న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ను పంచుకుంది. ముంబై బ్యాక్డ్రాప్లో ఈ సినిమా రాబోతుంది. ధనుష్ ఇందులో బిచ్చగాడి పాత్రల్లో కనిపించనుండగా.. నాగార్జున బిజినెస్ టైకున్ పాత్రలో మెరవబోతున్నాడు. ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్రావుతో కలిసి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. ఈ పాన్ ఇండియా చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, కెమెరా: నికేత్ బొమ్మి.
A story of power..👑
A battle for wealth..💰
A game of fate..♟️#SekharKammulasKuberaa is ready to deliver an enchanting theatrical experience from 𝟐𝟎𝐭𝐡 𝐉𝐮𝐧𝐞, 𝟐𝟎𝟐𝟓. pic.twitter.com/EuH5cEppYr— Kubera Movie (@KuberaTheMovie) February 27, 2025