ఇటీవల విడుదలైన ‘ఆదిపురుష్’ చిత్రంలో జానకి పాత్రలో మెప్పిస్తున్నది కృతిసనన్. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కృతిసనన్ తన ఇన్స్టాగ్రామ్లో ఆసక్తికరమైన వీడియోలను షేర్ చేసింది. ఇందులో ‘ఆదిపురుష్’ చిత్రాన్ని థియేటర్స్లో వీక్షిస్తున్న ప్రేక్షకులు సంబరాలు చేసుకోవడం, కొన్ని సన్నివేశాలకు చప్పట్లు కొడుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న వీడియోలు ఉన్నాయి.
జై శ్రీరామ్ అనే నినాదాలతో థియేటర్లు మార్మోగిపోతున్న వీడియోలకు కూడా కృతిసనన్ షేర్ చేసింది. ‘ప్రస్తుతం నేను చప్పట్లు, పొగడ్తలను మాత్రమే వింటున్నా. మిగతా విషయాలను పక్కన పెట్టాను. నా వృత్తిమీదనే దృష్టి పెట్టాను. జై శ్రీరామ్’ అంటూ వీడియోలపై వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఈ భామ హిందీలో ‘గణపత్’ ‘ది క్రూ’అనే చిత్రాల్లో నటిస్తున్నది.