Kriti Sanon | బాలీవుడ్ కథానాయిక కృతిసనన్ ‘దో పట్టి’ చిత్రంతో నిర్మాతగా మారుతున్న విషయం తెలిసిందే. ఇందులో ఆమె సీనియర్ నటి కాజోల్‌తో కలిసి నటిస్తున్నది. కవలలైన అక్కాచెల్లెళ్ల కథతో మర్టర్ మిస్టరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శశాంక చతుర్వేది దర్శకుడు. నటి కనికా థిల్లాన్ ఈ చిత్రానికి కథనందించింది. ఈ సినిమాలో కృతిసనన్ ద్విపాత్రాభినయంలో నటిస్తున్నది.
కెరీర్లో తొలిసారి ఆమె డ్యూయల్ రోల్‌ను పోషిస్తుండటం విశేషం. నిర్మాతగా తన తొలి ప్రాజెక్ట్ కాబట్టి ఈ సినిమాపై కృతిసనన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నదట. ఉత్తరాఖండ్‌లోని ఓ చిన్న టౌన్లో జరిగే హత్య నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, ప్రేమ, పగ, ప్రతీకారం వంటి అంశాలతో ఆద్యంతం ఉత్కంఠను పంచుతుందని, తన పాత్రలో భిన్న పార్శాలుంటాయని కృతిసనన్ పేర్కొంది. ఈ నెల 25 నుంచి ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో
స్ట్రీమింగ్ కానుంది.