1 నేనొక్కడినే చిత్రంలో మహేష్ సరసన నటించి మెప్పించిన అందాల ముద్దుగుమ్మ కృతి సనన్. ఈ సినిమా తర్వాత మళ్లీ ఆదిపురుష్ చిత్రంతో ప్రేక్షకులని పలకరించేందుకు సిద్ధమైంది. జానకి పాత్ర పోషిస్తున్నకృతి ఇటీవల తన పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం రాజ్‌కుమార్ రావ్ తో కలసి ‘హమ్ దో హమారే దో’ అనే కామెడీ డ్రామాలో నటిస్తోంది. ఈ సినిమా అక్టోబర్ 29 న డిస్నీ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది.
కృతి సనన్ కొద్ది రోజులుగా కొత్త ఇంటి కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. కొత్త ఇంట్లో దీపావళి వేడుకలు నిర్వహించుకోవడానికి రెడీ అవుతున్నారు. కృతి, అంధేరీలో ఉన్న అమితాబ్ బచ్చన్ డూప్లెక్స్ని అద్దెకు తీసుకున్నారు. త్వరలో ఈ కొత్త ఇంటికి ఆమె మారనున్నారు. బిగ్ బి లగ్జరీ డ్యూప్లెక్స్ అపార్ట్ మెంట్ విలువ 31 కోట్లట. అంధేరిలో అట్లాంటిస్ భవనం 27, 28 అంతస్తులో ఈ డూప్లెక్స్ ఉన్నట్లు సమాచారం.
కెరీర్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చిన కృతి సనన్..ఆ మధ్య మెర్సిడెజ్ బెంజ్ మేబాజ్ జీఎల్ఎస్ 600 లగ్జరీ కార్ తీసుకున్నారు. త్వరలో ఇప్పుడు కొత్త ఇంటికి మారబోతున్నారు. ప్రస్తుతం ‘భేదియా, ఆదిపురుష్, బచ్చన్ పాండే, గణపత్’ వంటి సినిమాలలో నటిస్తోంది.