బాలీవుడ్ ముద్దుగుమ్మ కృతి సనన్ ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ చిత్రంలో సీతగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఎపిక్ పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ‘ఆదిపురుష్’ సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఐదు భాషల్లో రూపొందనున్న టీ సిరీస్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే కృతి పలు సన్నివేశాలలో నటించింది.
‘1 నేనొక్కడినే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్. ఆ తర్వాత ‘దోచేయ్’ సినిమాలో నటించిన కృతి పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో కృతికి టాలీవుడ్ ఆఫర్స్ రాలేదు. వెంటనే బాలీవుడ్‌కి చెక్కేసిన ఈ అమ్మడు అక్కడ వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ అభిమానుల దృష్టిని ఆకర్షించింది.
‘మిమీ’ చిత్రంలో సరోగేట్ మదర్‌గా నటించడానికి 15 కిలోలు బరువు పెరిగింది. మళ్లీ ఆ బరువు తగ్గేందుకు చాలా కష్టపడింది. ఇదిలా ఉంచితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే కృతి సనన్ తాజాగా పెళ్లి కూతురు గెటప్‌లో పలు ఫొటోలకు ఫోజులిచ్చి వాటిని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. కృతిని ఇలా చూసి అభిమానులు మైమరచిపోతున్నారు. పెళ్లి కళ వచ్చేసిందే బాల అంటూ కామెంట్స్ పెడుతున్నారు.