Kriti Sanon | ‘నన్నెంతో ప్రభావితం చేసిన నటి కాజోల్. ఆమెను ప్రేరణగా తీసుకొని చాలామంది హీరోయిన్లయ్యారు. వారిలో నేనూ ఒకదాన్ని’ అంటున్నారు జాతీయ ఉత్తమనటి కృతి సనన్. కాజోల్‌తో కలిసి ‘దో పత్తీ’ అనే వెబ్‌సిరీస్‌లో నటించింది కృతి సనన్. ఈ సిరీస్ నిర్మాత కూడా తానే కావడం విశేషం. త్వరలోనే ఈ సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా కాజోల్‌తో తన అనుబంధం గురించి మాట్లాడింది కృతి సనన్.
‘తొమ్మిదేండ్ల క్రితం ‘దిల్వాలే’ సినిమాలో కాజోల్ అక్కతో కలిసి నటించాను. అది నా రెండో సినిమా. సినిమాలపై పెద్దగా అవగాహన కూడా అప్పట్లో నాకు లేదు. సెట్లో ఎలా మాట్లాడాలో కూడా తెలీదు. ఆ సమయంలో అక్క నాకు అండగా నిలిచింది. ఎన్నో విషయాలు ఆమె వల్లే తెలుసుకున్నా. నటనా పరంగానే కాదు, వ్యక్తిత్వపరంగా కూడా కాజోల్ నాకు స్ఫూర్తి.’ అని చెప్పుకొచ్చింది కృతి సనన్.