HomeCinemaKriti Sanon Enjoys Breezy Boat Ride And Stunning Sunset On Vacation
నా హృదయంలో ఇంద్రధనస్సు
అటు నటిగా, ఇటు నిర్మాతగా కూడా సత్తా చాటుతున్న నటి కృతి సనన్. జాతీయ ఉత్తమనటిగా అవార్డును అందుకున్న తర్వాత కెరీర్ విషయంలో చాలా జాగ్రత్తగా ముందుకెళ్తున్నారామె.
అటు నటిగా, ఇటు నిర్మాతగా కూడా సత్తా చాటుతున్న నటి కృతి సనన్. జాతీయ ఉత్తమనటిగా అవార్డును అందుకున్న తర్వాత కెరీర్ విషయంలో చాలా జాగ్రత్తగా ముందుకెళ్తున్నారామె. కమర్షియల్ హీరోయిన్గా పలు సినిమాలో మెరిసిన కృతి.. రీసెంట్గా ‘దోపట్టి’ లాంటి కల్ట్ మూవీతోనూ మెప్పించింది. క్షణం తీరిక లేకుండా షూటింగుల్లో బిజీబిజీగా గడిపే ఈ పొడుగు కాళ్ల సుందరి, అప్పుడప్పుడు మానసిక ప్రశాంతత, శారీరక స్వాంతన కోసం వెకేషన్లకు చెక్కేస్తుంటుంది.
రీసెంట్గా తను ఓ బీచ్ సెలబ్రేషన్స్‌లో పాల్గొని దానికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ‘చుట్టూ నీలి సముద్రం, మధ్యలో క్రూయిజ్. దానిపై భారీ సెటప్. రుచికరమైన రకరకాల వంటకాలు.. వైవిధ్యమైన ఫొటో షూట్స్.. ఈ ఆదివారం అంతా చిల్‌గా గడిచిపోయింది..’ అని పేర్కొన్నది కృతి సనన్. ఈ సందర్బంగా ‘నా హృదయంలో ఇంద్రధనస్సు అలలు అలలుగా ప్రవహిస్తున్నది..’ అంటూ ఓ కవితను కూడా రాసేసింది.