Kriti Sanon | అవకాశాలు ఎవరూ ఇవ్వరు.. మనమే సృష్టించుకోవాలంటున్న కృతిసనన్
వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు చేస్తూ హిందీ చిత్రసీమలో ప్రత్యేకతను చాటుకుంటున్నది కృతిసనన్. ఇటీవల విడుదలైన ‘ది క్రూ’ చిత్రంతో ఈ భామ మంచి విజయాన్ని దక్కించుకుంది.
Kriti Sanon | వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు చేస్తూ హిందీ చిత్రసీమలో ప్రత్యేకతను చాటుకుంటున్నది కృతిసనన్. ఇటీవల విడుదలైన ‘ది క్రూ’ చిత్రంతో ఈ భామ మంచి విజయాన్ని దక్కించుకుంది. ఆమె నటిస్తూ నిర్మాణ బాధ్యతలు చేపట్టిన ‘దో పత్తి’ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా నిర్మాతగా తన అనుభవాలను పంచుకుంది కృతిసనన్. సినీ రంగంలోకి అడుగుపెట్టినప్పుడే ఏదో ఒక రోజు నిర్మాతగా మారాలని నిర్ణయించుకున్నానని చెప్పిందీ భామ.
సినీ రంగంలో అవకాశాలు ఎవరూ ఇవ్వరని, మనమే సృష్టించుకోవాలని సలహా ఇచ్చింది. “మిమి’ సినిమా షూటింగ్ టైమ్‌లోనే ‘దో పత్తి’ స్క్రిప్ట్ విన్నా. మిస్టరీ థ్రిల్లర్ కథాంశంతో అద్భుతంగా అనిపించింది. నా హృదయానికి ఎంతో దగ్గరైంది. కథలో నేనే కొన్ని మార్పులను సూచించాను. సినీ రంగం సృజనాత్మకతతో కూడుకున్నది. ఇక్కడ ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలతో ముందుకెళ్లాలి. అవకాశాలను కూడా మనమే సృష్టించుకోవాలి’ అని కృతిసనన్ చెప్పింది. తాను కామెడీ సినిమాలను బాగా ఇష్టపడతానని, అలాగే ఓ స్వచ్ఛమైన ప్రేమకథలో నటించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నానని కృతిసనన్ పేర్కొంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

