krithi Shetty | సినీరంగంలో హీరోయిన్గా మెదటి అవకాశం రావడమే అరుదు. అలాంటిది అవకాశం వస్తే దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి అనేది హీరోయిన్లకు తెలియాలి. అప్పుడే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఉండగలం అని పలువురు స్టార్ హీరోయిన్లు గతంలో చెప్పినవే. ఈ విషయంలో తనకు సాటి ఎవరూ లేరని ప్రతి సినిమాకు తన ప్రతిభను నిరూపించుకుంటున్న నటి కృతిశెట్టి. ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్ మొత్తాన్ని తనవైపు చూసేలా చేసుకుంది. ఈ చిత్రంలో తన నటన, అందం, అభినయంతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్ర సక్సెస్‌తో కృతికి అవకాశాలు క్యూ కట్టాయి. అవకాశాలు వస్తున్నాయి కదా అని ఏ కథ దొరికితే ఆ కథను చేయకుండా నటనకు ప్రాధాన్యమున్న పాత్రలనే ఎంచుకుంటూ సినీరంగంలో దూసుకుపొతుంది. ఈ ఏడాది ‘బంగార్రాజు’ సినిమాతో మరో బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఈమె చేతిలో మూడు సినిమాలున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈమెకు కోలీవుడ్‌లో ఓ స్టార్ హీరోతో నటించే అవకాశం వచ్చినట్లు సమాచారం.
ఇటీవలే ‘ఈటీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సూర్య. మార్చి10న విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్‌ను తెచ్చుకుంది. కథ, కథనం బాగున్నా ఎమోషనల్సీన్లు, యాక్షన్ సీన్లు ఓవర్‌గా ఉన్నాయంటూ సినీప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక సూర్య తన తదుపరి చిత్రాన్ని బాల దర్శకత్వంలో చేయనున్నట్లు ఇదవరకే ప్రకటించాడు. ఇరవై ఏళ్ళ తర్వాత మళ్ళీ వీళ్ళ కాంబో సెట్టవడంతో ప్రేక్షకులలో ఈ చిత్రంపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో ఇప్పటికే జ్యోతిక హీరోయిన్గా నటించనున్నట్లు ప్రకటించారు.తాజాగా ఈ చిత్రంలో మరో హీరోయిన్‌కు చోటు ఉందని సమాచారం. దాని కోసం మేకర్స్ కృతి శెట్టిని సంప్రదించారని, దానికి కృతి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. సూర్య సినిమాలలో హీరోయిన్ పాత్రలకు మంచి గుర్తింపు ఉంటుంది. అందుకే సూర్యతో నటించడానికి హీరోయిన్లు ఆసక్తి చూపిస్తుంటారు. కృతిశెట్టి కూడా అదేవిధంగా ఈ చిత్రంలో నటించడానికి ఒప్పుకుందని సమాచారం. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
కృతిశెట్టి ప్రస్తుతం మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాలో నటిస్తుంది. సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్నాడు.దీనితో పాటుగా రామ్ సరసన ‘ది వారియర్’ మూవీలో నటిస్తుంది. ఎన్ లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కృతి, విజిల్ మహాలక్ష్మి పాత్రలో నటిస్తుంది. వీటితో పాటుగా నితిన్ హీరోగా తెరకెక్కతున్న ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది.