‘కస్టడీ’ చిత్రంలో నా పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇదొక యాక్షన్ ఎంటర్టైనర్. ఈ సినిమా కోసం జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ చేశాను’ అని చెప్పింది కృతిశెట్టి. ఆమె నాగచైతన్య సరసన కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి వెంకట్‌ప్రభు దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 12న విడుదలకానుంది. ఈ సందర్భంగా కృతిశెట్టి మాట్లాడుతూ ‘కథాగమనంలో నా క్యారెక్టర్ చాలా కీలకంగా ఉంటుంది. సాధారణంగా సినిమాల కోసం డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటాం.
ఈ సినిమా కోసం నేను జిమ్నాస్టిక్స్ నేర్చుకున్నా. అండర్‌వాటర్‌లో 15రోజుల పాటు తీసిన యాక్షన్ సీక్వెన్స్ హైలైట్‌గా నిలుస్తుంది. దీనికోసం ఐదు రోజుల పాటు ఎక్కువగా నీళ్లలోనే ఉండాల్సి వచ్చింది. ఒక్కషాట్ కోసం ఊపిరితీసుకోకుండా రెండు నిమిషాలు ఉండాల్సి వచ్చింది. కొన్ని సందర్భాల్లో చాలా భయపడ్డా. నాగచైత్య నా అభిమాన నటుడు మాత్ర మే కాదు..ఆయన నిజాయితీ కూడా బాగా నచ్చుతుంది. ఈ సినిమా సెట్స్‌లో నేను రౌడీలా ఉన్నానని దర్శకుడు వెంకట్‌ప్రభు సరదాగా అనేవారు. వ్యక్తిగతంగా కూడా నాది కాస్త రౌడీ మనస్తత్వమే (నవ్వుతూ). ప్రయత్నం చేయడం వరకే నా బాధ్యతగా భావిస్తా. జయాపజయాల గురించి అంతగా ఆలోచించను. త ప్పుల నుంచి గుణపాఠాల్ని నేర్చుకునే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం తెలుగులో శర్వానంద్‌తో ఓ సినిమా చేస్తున్నా. మలయాళంలో కూడా ఓ చిత్రాన్ని అంగీకరించా. కొన్ని చిత్రాలు చర్చ ల దశలో ఉన్నాయి’ అని చెప్పింది.