Krithi Shetty | ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్లో సంచలన ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి ఒక్కసారిగా స్టార్ రేంజ్‌ను అందుకుంది. బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ప్యూర్ లవ్ ఎమోషనల్ డ్రామా దేశవ్యాప్తంగా హిట్ అవడంతో కృతి ఒక్క సినిమాతోనే 100 కోట్ల గ్రాస్ అందుకున్న అరుదైన హీరోయిన్గా మారింది. దీంతో టాలీవుడ్లో ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి.అయితే… ఉప్పెన స్థాయిలో ఆ తరువాతి సినిమాలు ఏదీ సక్సెస్ కాలేదు. ‘ది వారియర్’, ‘మాచర్ల నియోజకవర్గం’, ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, ఇలా వచ్చిన చాలా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విఫలం కావడంతో కృతి శెట్టిపై ట్రోలింగ్ తీవ్రంగా పెరిగింది. సోషల్ మీడియాలో ‘ఐరన్ లెగ్’, ‘ఫ్లాప్ రాణి’ వంటి ట్యాగులు తగిలించడంతో ఆమె మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురైనట్లు తెలిపింది.
ప్రస్తుతం కార్తీ హీరోగా నటించిన ‘వా వాతియార్’ (Va Vaathiyaar) సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న కృతి, ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్లో ఎదుర్కొన్న కష్టాలను పంచుకుంది. నటనకి చాలా భావోద్వేగ శక్తి అవసరం. మనం ఎంత కష్టపడినా… ఎలాంటి కారణం లేకుండా వచ్చే ద్వేషం, విమర్శలు భరించలేనివి. ఉప్పెన తర్వాత వచ్చిన ట్రోల్స్ వల్ల నేను తీవ్రంగా బాధపడ్డాను.ఒక దశలో ‘నటననే ఆపేయాలా? అనిపించింది అని కృతి శెట్టి పేర్కొంది. అలాగే ఆమె తన ఆరోగ్యంపై ఆ సమయంలో పడిన ప్రభావాన్ని కూడా వెల్లడించింది.
స్ట్రెస్ వల్ల జుట్టు రాలిపోవడం, చర్మ సమస్యలు వచ్చాయి. మా అమ్మానాన్నలూ భయపడ్డారు. చేయడం ఇష్టం లేకపోతే వదిలేయి అని చెప్పారు. కానీ ఉప్పెన నుంచి వచ్చిన ప్రేమ నన్ను నిలబెట్టింది అంటూ కృతి చెప్పిన ఈ భావోద్వేగ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అనేక మంది నెటిజన్లు ఆమెను ధైర్యంగా నిలిచిందని ప్రశంసిస్తున్నారు. డౌన్ఫేజ్ను దాటుకున్న కృతి శెట్టి ఇప్పుడు మళ్లీ బలమైన ప్రాజెక్టులు చేసేందుకు సిద్ధమవుతోంది.కార్తీ నటించి వా వాతియర్ డిసెంబర్ 12న విడుద లకానుండగా, LIK – Love Insurance Company – ప్రదీప్ రంగనాథన్ హీరో, విగ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందుతుంది. ఈ రెండు సినిమాలు కృతికి కంబ్యాక్‌గా మారతాయని అభిమానులు ఆశిస్తున్నారు.