హైదరాబాద్ : రెబల్ స్టార్ కృష్ణంరాజు అంత్యక్రియలు రేపు అధికారికంగా నిర్వహించనున్నారు. రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ పరిధిలోని కనకమామిడి ఫామ్ హౌస్లో మధ్యాహ్నం ఒంటిగంటకు కృష్ణంరాజు అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రస్తుతం కృష్ణంరాజు భౌతికకాయం జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో ఉంచారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పిస్తున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.