Krishnamma Movie | టాలీవుడ్ హీరో సత్యదేవ్ (Satyadev) కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘కృష్ణమ్మ’ (Krishnamma). ఈ సినిమాకు వి.వి.గోపాల కృష్ణ దర్శకత్వం వహించగా.. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్లో కృష్ణ కొమ్మలపాటి ఈ సినిమాను నిర్మించాడు. టాలీవుడ్ స్టార్ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో ఈ చిత్రం వచ్చింది. బెజవాడ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ చిత్రం మే 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. పాజిటివ్ టాక్‌తో నడుస్తున్న ఈ చిత్రం రీసెంట్గా బ్రేక్ ఈవెన్‌ను కూడా పూర్తి చేసుకుంది. అయితే తాజాగా ఈ చిత్రం సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది.
ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. ఈ విషయాన్ని మేకర్స్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. నేటి నుంచి తెలంగాణలో థియేటర్లు బంద్ అన్న ముచ్చట తెలిసిందే. ఇక సింగిల్ స్క్రీన్స్ బంద్ అవ్వడంతో ఈ మూవీని ఓటీటీ కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. అతిరా రాజీ ఈ చిత్రంలో హీరోయిన్గా నటించగా.. కాల భైరవ సంగీతం అందించాడు. కృష్ణనది పక్కన ఉండే ఓ చిన్న పట్టణంలో ఉండే ముగ్గురు స్నేహితుల కథ ఈ సినిమా. ఈ ముగ్గురికి ఓ విలన్‌కు మధ్య జరిగే గొడవే ‘కృష్ణమ్మ’. వీరి మధ్య జరిగిన ఓ ఘటన వారి ముగ్గురి జీవితాల్ని ఎలా మలుపు తిప్పింది? ఈ క్రమంలో ఎదురైన సవాళ్లేంటి? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
#Krishnamma – Streaming Now
Theatrical Release – 10th May
Digital Release – 17th May pic.twitter.com/8PDnXvl0Es— Movies4u Official (@Movies4u_Officl) May 16, 2024