Krishnam Raju| రెబల్ స్టార్‌గా కృష్ణంరాజు ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 1966లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కృష్ణం రాజు తెలుగు ప్రేక్షకుల హృదయాలపై చెరగని ముద్ర వేసుకున్నారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా, కేంద్ర మంత్రిగా పలు బాధ్యతలను నిర్వర్తించారు. ఇక కృష్ణంరాజుకు ముగ్గురు కుమార్తెలే కావడంతో.. తన తమ్ముడి కుమారుడైన ప్రభాస్‌ను తన కొడుకుగా భావించి ఆయన పాన్ ఇండియా స్టార్‌గా ఎదగడంలో ఎంతో కృషి చేశారు కృష్ణంరాజు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో క్షత్రియ వంశంలో జన్మించిన కృష్ణంరాజుది సంపన్న కుటుంబం. ఆయన వ్యక్తిగతంగా చాలా మంచివారు.
రాజుల కుటుంబం నుంచి రావడంతో ఆయన ప్రతి ఒక్కరిని చాలా బాగా చూసుకుంటారు. తనతో పని చేసిన ప్రతి ఒక్కరికి కూడా మంచి విందు వడ్డిస్తుంటారు. తన మాటలతో కాని, చేతలతో కాని ఎవరికి హాని చేయని మనస్తత్వం కృష్ణంరాజుది. అయితే సీనియర్ నటి గీతాంజలి ఓ సందర్భంలో కృష్ణంరాజుతో పని చేసేటప్పుడు జరిగిన సంఘటనని గుర్తు చేసుకుంటూ అందరికి షాక్ ఇచ్చింది.
మంచి రోజులు వచ్చాయి సినిమాలో ఏఎన్నార్‌కి చెల్లిగా గీతాంజలినటించింది. ఇందులో కాంచన హీరోయిన్ కాగా, కృష్ణంరాజు విలన్ పాత్ర పోషించాడు. అయితే ఓ సీన్లో గీతాంజలిని కృష్ణంరాజు ఇబ్బంది పెట్టాలట. అయితే ఆ సన్నివేశం చేసేటప్పుడు గీతాంజలి నిజంగానే ఇబ్బంది పడిందట. ఇద్దరి మధ్య మాట మాట పెరిగి, కృష్ణంరాజుపై గీతాంజలి ఉమ్మేయాల్సిన పరిస్థితి వచ్చిందట. ఆ సీన్ చేయడానికి గీతాంజలి ఇబ్బంది పడి తాను చేయనని చెప్పిన కూడా దర్శకుడు మధుసూధనరావు వినలేదట. దాంతో ఐస్‌క్రీమ్ నోట్లో పెట్టుకొని దాని నురగని కృష్ణంరాజుపై ఉమ్మిందట.
అప్పుడు కోపోద్రిక్తుడైన కృష్ణం రాజు నాపైనే ఉమ్మి వేస్తావా అంటూ ఆమెపై పడి చీర లాగి, బట్టలన్నీ చించేసి అంతా నలిపేసి ఆగమాగం చేశాడట. చివరికి కుక్కని కూడా తనపైకి వదిలాడట. ఇప్పుడు నీ జీవితం చించిన విస్తరిలా మారుతుంది అని చెప్పి ఆమెని ఇబ్బంది పెట్టాడట. అయితే ఆ సన్నివేశంలో గీతాంజలి ఎంతో ఇబ్బంది పడి నరకం చూసిందట. ఆ సీన్ తన జీవితంలో ఎప్పుడు మరిచిపోలేనని కూడా గీతాంజలి పేర్కొంది. కొన్నేళ్ల క్రితం ఈ విషయాన్ని గీతాంజలి ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది.