Krishna Vrinda Vihari Teaser | ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి తన నటనతో, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న యువ హీరో నాగశౌర్య. వైవిధ భరిత పాత్రలను ఎంచుకంటూ సినీరంగంలో తనకంటూ పత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఛలో సక్సెస్ తర్వాత నాగశౌర్య కథల ఎంపిక పూర్తీగా మారిపోయింది. ఒకే జానర్లో సినిమాలు చేయకుండా విభిన్న కథలతో రొటీన్‌కు భిన్నంగా సినిమాలను చేస్తున్నాడు. లేటెస్ట్గా ఈయన నటించిన చిత్రం కృష్ణ వ్రింద విహారి. అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులలను అలరిస్తున్నాయి. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
కనిపించి వినిపించకుండా.. వినిపించి కనిపించకుండా అంటే మొదలైన టీజర్ ఆధ్యాంతం ఆకట్టుకుంటుంది. ఈ గంట సప్పుడేందయ్యా.. దగ్గర్లో గుడి లేదు, చర్చి కూడా లేదు అంటూ రాహుల్ రామకృష్ణ, సత్య చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. టీజర్ చివర్లో పెళ్ళిచేసుకుందాం సినిమాలో సౌందర్యలాగా సెక్స్ అబ్యూస్ ఏమైనా.. పర్లేదు వెంకటేష్ కన్నా బాగా చూసుకుంటా అంటూ చెప్పే నాగశౌర్య డైలాగ్ ఆకట్టుకుంటుంది. మహతి స్వర సాగర్ నేపథ్య సంగీతం బాగుంది. విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి.
లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై ఉషా ముల్పూరి నిర్మిస్తున్నారు. నాగశౌర్యకు జోడిగా షిర్లే సేటియా హీరోయిన్గా నటిస్తుంది.