Super Star Krishna | ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన సూపర్‌స్టార్ కృష్ణ పార్థివదేహాన్ని కాంటినెంటల్ ఆసుపత్రి నుంచి నానక్‌రాంగూడలోని ఆయన నివాసానికి తరలించారు. కృష్ణ భౌతికకాయాన్ని ఇంటి వద్ద కాసేపు ఉంచి అనంతరం సాయంత్రం 5గంటల తర్వాత అభిమానుల సందర్శనార్థం గచ్చిబౌలి స్టేడియానికి తరలించనున్నారు. ఈ మేరకు గచ్చిబౌలి స్టేడియంలో పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.
సూపర్ స్టార్ కృష్ణ (80) మృతి చెందిన విషయం తెలిసిందే. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన ఉదయం 4.10 గంటలకు కాంటినెంటల్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. కార్డియాక్ అరెస్టుతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. కృష్ణ మరణ వార్త ఆయన కుటుంబ సభ్యులు, తెలుగు చిత్ర పరిశ్రమను తీవ్ర విషాదంలోకి నెట్టింది.