Krishna and His Leela | కరోనా లాక్డౌన్ టైంలో వచ్చి ఓటీటీలోకి సూపర్ హిట్ అందుకున్న చిత్రం కృష్ణ అండ్ హిస్ లీలా. స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలిన్ వాడినికట్టి హీరోయిన్లుగా నటించారు. రానా దగ్గుబాటి, సంజయ్ రెడ్డి నిర్మించగా.. రావికాంత్ పేరేపు దర్శకత్వం వహించాడు.
ఈ సినిమా విడుదల సమయంలో లాక్డౌన్ పడడంతో నేరుగా ఆహాతో పాటు నెట్ఫ్లిక్స్ వేదికగా విడుదలయ్యింది ఈ చిత్రం. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ చిత్రం ఓటీటీలో మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఇప్పుడు ఇదే చిత్రాన్ని థియేటర్లో విడుదల చేయబోతున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది. వాలంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమాను ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం తెలిపింది. మరోవైపు ఈ సినిమా టైటిల్ను థియేటర్ వెర్షన్లో ఇట్స్ కాంప్లీకేటేడ్ అని పెట్టినట్లు తెలిపింది.