Anushka Shetty | టాలీవుడ్ దర్శకుడు క్రిష్ జాగర్లమూడికి మంచి టాలెంట్ ఉంది. ఆయన తెరకెక్కించే సినిమాలు ప్రేక్షకుల మదిలో అలా నిలిచిపోతాయి. ఏ దర్శకుడు టచ్ చేయని కాన్సెప్టులతో క్రిష్ పలు సినిమాలు తెరకెక్కించాడు. అయితే సరైన ప్లానింగ్ లేకపోవడం వల్లనే క్రిష్ స్టార్ డైరెక్టర్ కాలేపోయాడు. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో హరిహర వీరమల్లు అనే చిత్రం తెరకెక్కించగా,ఈ చిత్రంతో క్రిష్ జాతకం మారిపోవడం ఖాయం అని అనుకున్నారు. 9 నెలల్లో ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేద్దామని చేసిన క్రిష్… ఫస్ట్ హాఫ్ ని చాలా తొందరగా పూర్తి చేశారు. కానీ మధ్యలో కరోనా మహమ్మారి విలయతాండవం, లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అవ్వడం, ఇప్పుడు ఏకంగా డిప్యూటీ సీఎం పదవి కూడా దక్కించుకోవడంతో సినిమాకి టైం కేటాయించలేకపోతున్నాడు.
దాంతో ప్రాజెక్ట్ నుండి మధ్యలోనే తప్పుకున్నాడు డైరెక్టర్ క్రిష్. ఇక ఈ మూవీ నుండి తప్పుకున్న తర్వాత అనుష్కతో ఘాటి మొదలు పెట్టాడు. గత ఏడాది టీజర్ కూడా విడుదల చేసి మూవీపై భారీ అంచనాలు పెంచాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కూడా సినిమాపై ఆసక్తి కలిగేలా చేసింది. ఇక మూవీని ఏప్రిల్ 18న రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ గతంలో ప్రకటించారు. కాని మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో ఈ సినిమా పరిస్థితి అయోమయంగా మారింది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారనే దానిపై క్లారిటీ కూడా లేకుండా పోయింది.
సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయిందా?, లేకపోతే క్రిష్ ఈ చిత్రం నుండి తప్పుకున్నాడా?, సినిమా వాయిదా పడితే, కనీసం వాయిదా వేస్తున్నాము, త్వరలోనే విడుదలతేది ప్రకటిస్తాము అనే విషయాలు కూడా చెప్పడం లేదు. దీనిని బట్టి క్రిష్ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడా, అందుకే మూవీ ఆగిపోయిందా అని అందరు ముచ్చటించుకుంటున్నారు. అసలు క్రిష్ సినిమాలకే ఎందుకు ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. బాలీవుడ్ లో ఆయన ‘మణికర్ణిక’ వంటి చారిత్రాత్మక చిత్రాన్ని మొదలు పెట్టి, మధ్యలోనే వెళ్ళిపోయాడు. మిగిలిన సినిమాని కంగనా రనౌత్ దర్శకత్వం వహించారు. హరిహర వీరమల్లుని మధ్యలోనే వదిలిపెట్టేశారు. ఇక ఇప్పుడు ఘాటీని కూడా మధ్యలోనే వదిలేశారా అన్న ప్రశ్న తలెత్తుతుంది.