ఆర్యన్ గౌర, మిష్టి చక్రవరి జంటగా నటిస్తున్న చిత్రం ‘ఓ సాథియా’. దివ్యా భావన దర్శకత్వంలో చందన కట్టా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా దర్శకుడు క్రిష్ చేతుల మీదుగా ఈ సినిమాలోని ‘వెళ్లిపోయే.. పాపా వెళ్లిపోయే’ అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ ఈ పాట సినిమాలో బ్రేకప్ సాంగ్‌గా వస్తుంది.
యువతరాన్ని ఆకట్టుకునే విధంగా ఈ పాట వుంటుంది. చిత్రంలో కూడా యువతరంతో పాటు అన్ని వర్గాల వారిని అలరించే అంశాలున్నాయి’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: విన్ను.