Krish | ఐదుగురు హీరోయిన్లతో సినిమా.. క్రిష్ ప్లాన్ మామూలుగా లేదుగా..!
Krish | గమ్యం, వేదం, కృష్ణంవందే జగద్గురుమ్, కంచె వంటి గొప్ప సినిమాలను తెరకెక్కించి అభిరుచి గల దర్శకుడిగా కితాబులందుకున్నారు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి. సందేశాత్మక కథలకు వాణిజ్యఅంశాలను జోడించి జనరంజక చిత్రాలను అందించడం క్రిష్ ప్రత్యేకత. అయితే.. గత కొన్నేళ్లుగా క్రిష్ కెరీర్ సరైన ట్రాక్‌లో లేదు.
Krish | గమ్యం, వేదం, కృష్ణంవందే జగద్గురుమ్, కంచె వంటి గొప్ప సినిమాలను తెరకెక్కించి అభిరుచి గల దర్శకుడిగా కితాబులందుకున్నారు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి. సందేశాత్మక కథలకు వాణిజ్యఅంశాలను జోడించి జనరంజక చిత్రాలను అందించడం క్రిష్ ప్రత్యేకత. అయితే.. గత కొన్నేళ్లుగా క్రిష్ కెరీర్ సరైన ట్రాక్‌లో లేదు. ఎన్టీయార్ కథానాయకుడు, మహానాయకుడు, కొండపొలం, ఘాటీ చిత్రాల ఫలితాలు ఆయన కెరీర్‌పై తీవ్రమైన ప్రభావాన్నే చూపాయి. అందుకే.. గత వైభవాన్ని దక్కించుకునేందుకు ఈ సారి పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్తున్నారట క్రిష్.
ఈ సారి కాస్టింగ్‌పై కాకుండా కథపైనే ఎక్కువ శ్రద్ధపెట్టి, ఓ విభిన్నమైన కాన్సెప్ట్‌ని ప్రేక్షకులకు అందించే ప్రయత్నాల్లో ఆయన బిజీగా ఉన్నారట. అయిదుగురు అమ్మాయిల నేపథ్యంతో కూడిన ఓ కథను ఆయన ప్రస్తుతం తెరకెక్కిస్తున్నట్టు తెలిసింది. ఈ అయిదు ప్రధాన భూమికలకు అయిదుగురు యంగ్ హీరోయిన్లను ఎంపిక చేసినట్టు వినికిడి. ఇప్పటికే ఎలాంటి హడావిడి లేకుండా చిత్రీకరణ కూడా మొదలైంది. క్రిష్ గత చిత్రాల మాదిరిగానే ఆలోచింపజేసే కథ, కథనాలతో ఈ సినిమా ఉంటుందట. ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

