మనోజ్ చంద్ర, మోనిక టి, ఉషా బోనెల ప్రధాన పాత్రలు పోషిస్తున్న రూరల్ కామెడీ ఎంటైర్టెనర్ ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’. ప్రవీణ పరుచూరి స్వీయ దర్శకత్వంలో గోపాలకృష్ణ పరుచూరితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రానా దగ్గుబాటి సమర్పకుడు. పల్లెటూరి జీవితాలను, సరదాలను ఆవిష్కరించే సినిమా ఇదని మేకర్స్ చెబుతున్నారు. ఈ నెల 18న సినిమా విడుదల కానుంది. గురువారం మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు. లోకల్ రికార్డ్ డ్యాన్స్ స్టూడియో ఓనర్ రామకృష్ణ.. సావిత్రిని ప్రేమిస్తాడు.
ఒక రోజు సావిత్రి అతన్ని గడ్డివాము వద్ద కలవమంటుంది. రామకృష్ణ ఉత్సాహంగా వెళ్తాడు.. అక్కడే రామకృష్ణ ప్రేమకథ షాకింగ్ మలుపు తిరుగుతుంది. ఆ మలుపేంటి? ఆ తర్వాత ఏంజరిగింది? అనే ప్రశ్నలతో ట్రైలర్‌ని ఎండ్ చేశారు. ఈ కథ ఊహించని థ్రిల్లింగ్ అంశాలతో ఉంటుందని మేకర్స్ తెలిపారు. రవీంద్ర విజయ్, బెనర్జీ, బొంగు సత్తి, ఫణి, ప్రేంసాగర్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, నిర్మాణం: పరుచూరి విజయ ప్రవీణ్ ఆర్ట్స్.