Kotha Lokah | మలయాళం నుంచి వచ్చిన మరో సూపర్ హీరో మూవీ ‘కొత్త లోక’ (Kotha Lokah). చాప్టర్ 1 చంద్ర. మలయాళ నటులు కల్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan), నస్లేన్ (Naslen) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు డామినిక్ అరుణ్ దర్శకత్వం వహించగా.. వేఫర్ర్ ఫిలిమ్స్ బ్యానర్‌పై దుల్కర్ సల్మాన్ నిర్మించాడు. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య ఆగష్టు 28న ప్రేక్షకుల ముందుకు వచ్చి కేరళలో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమా తెలుగు హక్కులను దక్కించుకున్న సితార ఎంటర్టైనమెంట్స్ మూవీని నేడు విడుదల చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా తెలుగు వెర్షన్ విడుదలకు ఆలస్యం అవుతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది.
మలయాళంలో విజయం సాధించిన ‘కొత్త లోక’ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ విడుదల పలు సాంకేతిక సమస్యల కారణంగా ఆలస్యమైంది. కంటెంట్ డెలివరీ సమస్యల వల్ల ఉదయం, మధ్యాహ్నం ఆటలను ప్రదర్శించలేకపోతున్నాం. ఆంధ్రా, తెలంగాణలోని థియేటర్లలో ఈ సినిమా తెలుగు షోలు ఈ రోజు సాయంత్రం నుంచి ప్రారంభమవుతాయి అంటూ సితార ఎంటర్టైనమెంట్స్ ప్రకటించింది.
#KothaLokah hits theaters this EVENING. Get ready to dive into a new world of fantasy & thrill.🔥🔥
Book your tickets now… Don’t miss it! 🎟️@DQsWayfarerFilm @dominicarun @NimishRavi @kalyanipriyan @naslen__ @JxBe @chamanchakko @iamSandy_Off @AKunjamma @Vamsi84 @SitharaEnts… pic.twitter.com/fcfiGIWimV
— Sithara Entertainments (@SitharaEnts) August 29, 2025