Ranga Ranga Vaibhavanga | డెబ్యూ సినిమాతో రికార్డులు సృష్టించాడు మెగా మెనల్లుడు వైష్ణవ్ తేజ్. ‘ఉప్పెన’ సినిమాతో ఉప్పెనలాంటి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. తరువాత వచ్చిన ‘కొండపొలం’ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఈయన నటించిన చిత్రం ‘రంగరంగ వైభవంగా’. ‘అర్జున్ రెడ్డి’ తమిళ వెర్షన్ ‘ఆదిత్య వర్మ’ సినిమాకు దర్శకత్వం వహించిన గిరీశయ్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఈ క్రమంలో చిత్ర బృందం తరచూ ఒక అప్డేట్తో ప్రేక్షకులను పలకరిస్తుంది. తాజాగా ఈ చిత్రం నుంచి సెకండ్ సింగిల్‌ను మేకర్స్ విడుదల చేశారు.
‘కొత్తగా లేదేంటి.. కొత్తగా లేదేంటి.. ఇంత దగ్గరున్నా నువ్వు నేను.. కొత్తగా లేదేంటి’ అంటూ సాగిన ఆ బాణి శ్రోతలను ఆకట్టుకుంటుంది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ స్వర పరిచిన ఈ పాట మంచి ఫీల్‌ను కలిగిస్తుంది. శ్రీమణి సాహిత్యం అందించిన ఈ పాటను అర్మాన్ మాలీక్, హరిప్రియ ఆలపించారు. ఇటీవలే విడుదలైన ‘తెలుసా..తెలుసా’ పాటకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఈ చిత్రంలో వైష్ణవ్‌కు జోడీగా కేతిక శర్మ హీరోయిన్గా నటించింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం జూలై1న విడుదల కానుంది.