Megastar Chiranjeevi | ప్రముఖ సినీనటుడు కోట శ్రీనివాసరావు (Kota Srinivasarao) మృతిపట్ల అగ్ర కథానాయకుడు చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.
లెజెండరీ నటులు, బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ కోట శ్రీనివాస రావు గారు ఇక లేరనే వార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది. ‘ప్రాణం ఖరీదు’ చిత్రంతో ఆయన, నేను ఒకేసారి సినీ కెరీర్ను ప్రారంభించాం. ఆ తర్వాత వందలాది సినిమాల్లో ఎన్నెన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి, ప్రతి పాత్రనీ తన విలక్షణమైన, ప్రత్యేక శైలితో అలరించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.
కామెడీ విలన్గా అయినా, సీరియస్ విలన్గా అయినా, సహాయక పాత్రలైనా.. ఆయన పోషించిన ప్రతి పాత్ర ‘ఆయన మాత్రమే చేయగలడు’ అన్నంత గొప్పగా నటించారు. ఇటీవలి కాలంలో ఆయన కుటుంబంలో జరిగిన వ్యక్తిగత విషాదం ఆయన్ని మానసికంగా ఎంతగానో కుంగదీసింది. కోట శ్రీనినివాస రావు గారి లాంటి నటుడి లోటు చిత్ర పరిశ్రమకి, సినీ ప్రియులకి ఎన్నటికీ తీరనిది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకి, శ్రేయోభిలాషులకి, అభిమానులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. అంటూ చిరు రాసుకోచ్చాడు.
లెజెండరీ యాక్టర్ , బహుముఖ ప్రజ్ఞా శాలి
శ్రీ కోట శ్రీనివాస రావు గారు ఇక లేరు అనే వార్త ఎంతో కలచివేసింది.‘ప్రాణం ఖరీదు’ చిత్రం తో ఆయన నేను ఒకే సారి సినిమా కెరీర్ ప్రారంభించాము. ఆ తరువాత వందల కొద్దీ సినిమాల్లో ఎన్నెన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి, ప్రతి పాత్రని తన…
— Chiranjeevi Konidela (@KChiruTweets) July 13, 2025