Kota Factory | ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా వచ్చిన వెబ్ సిరీస్‌లలో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న సిరీస్ ‘కోట ఫ్యాక్టరీ’ (Kota Factory). ఉన్నత చదువులు, ఉద్యోగాల కోచింగ్‌కు ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్ (Rajasthan) కోటా (Kota)లో ఉన్న విద్యార్థుల జీవితాల ఆధారంగా వచ్చిన ఈ వెబ్ సిరీస్ విడుదలైన నాటి నుంచే మంచి టాక్ తెచ్చుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి రెండు సీజన్లు విడుదల కాగా రికార్డు వ్యూస్‌తో మంచి విజయాన్ని సాధించాయి. ఇదిలావుంటే తాజాగా మూడో సీజన్ ఓటీటీలోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ సిరీస్ ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది.
పంచాయత్ వెబ్ సిరీస్ ఫేమ్ జితేంద్ర కుమార్ ఇందులో టీచర్‌గా నటించగా.. వైభవ్(మయూర్ మోర్) లీడ్ రోల్లో నటించాడు. ఈ సిరీస్ కథ విషయానికి వస్తే.. ఐఐటీలో సీటు కోసం కోటా (Kota)లో వైభవ్(మయూర్ మోర్) పడిన ఇబ్బందులను ఆధారంగా ఈ వెబ్ సిరీస్ వచ్చింది. సౌరభ్ కన్నా రూపొందించిన ఈ వెబ్ సిరీస్‌కు రాఘవ్ సుబ్బు దర్శకత్వం వహించారు. అహ్సాస్ చన్నా, మయూర్ మోర్, రేవతి పిళ్లై తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు.
It’s D-DAY 🤞 Kota Factory: Season 3 is now streaming, only on Netflix!#KotaFactoryS3OnNetflix pic.twitter.com/xoY5EtMsOg
— Netflix India (@NetflixIndia) June 20, 2024