Koratala Siva | దేవర పార్ట్ వన్ చిత్రంతో భారీ హిట్ అందుకున్నాడు దర్శకుడు కొరటాల శివ. ఆచార్య వంటి డిజాస్టార్ తర్వాత కొరటాల డైరెక్షన్లో ఈ మూవీ రావడం ఎన్టీఆర్ కథానాయకుడిగా ఉండడంతో మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి హిట్టుని నమోదు చేసుకోవడమే కాకుండా రూ.500 కోట్ల వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా అనంతరం తారక్ ప్రస్తుతం వార్ 2తో పాటు ప్రశాంత్ నీల్ సినిమాతో బిజీ ఉండగా.. కొరటాల శివ దేవర 2 కోసం వెయిట్ చేస్తాడా లేదా మరో కొత్త హీరోతో సినిమా చేస్తాడా అనే డిస్కషన్ ప్రస్తుతం టాలీవుడ్లో జరుగుతుంది.
తాజా సమాచారం ప్రకారం కొరటాల శివ మలయాళం స్టార్ హీరో కొడుకుతో ఒక సినిమా ప్లాన్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్‌తో కొరటాల శివకు మంచి అనుభందం ఉన్న విషయం తెలిసిందే. శివ దర్శకత్వంలో వచ్చిన జనతా గ్యారేజ్‌లో మెహన్ లాల్ కీలక పాత్రల్లో నటించాడు. అయితే మోహన్ లాల్‌తో ఉన్న రిలేషన్ వలన తన కొడుకు కోసం ఒక కథను రెడీ చేయబోతున్నాడు శివ. మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ మోహన్ లాల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 2022లో వచ్చిన హృదయం సినిమాతో మంచి హిట్టును అందుకున్నాడు. ఇక ప్రణవ్ను దృష్టిలో పెట్టుకుని శివ కథను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.